: సీమాంధ్రులకు పదవులిస్తే మాకేంటి?: పొన్నం, రాజయ్య
సీమాంధ్ర ఎంపీలకు కేంద్రప్రభుత్వంలో మంత్రి పదవులివ్వడం తమకు అభ్యంతరం లేదని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య అన్నారు. అభివృద్ధి మండలి, ప్యాకేజీ వంటివి తెలంగాణకు ఆమోదనీయం కాదన్నారు. మధ్యప్రదేశ్ విభజనకు సహకరించినట్లుగానే దిగ్విజయ్‌సింగ్ తెలంగాణకూ సహకరించాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే తెలంగాణలో కాంగ్రెస్‌కు నష్టం తప్పదని హెచ్చరించారు.