: కాంగ్రెస్ ను ప్రజలు సస్పెండ్ చేస్తారు: కిషన్ రెడ్డి
అసెంబ్లీలో కాంగ్రెస్ మమ్మల్ని సస్పెండ్ చేస్తే, ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను సస్పెండ్ చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హెచ్చరించారు. అసలు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందా? ఇవ్వదా? అని ఆయన ప్రశ్నించారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అన్ని పార్టీల వెంట తిరుగుతోందన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి వెల్లడించకుంటే ఎన్నికల్లో ప్రజలు తమ వైఖరి వెల్లడిస్తారని కిషన్ రెడ్డి అన్నారు.