: తెరాస జాతీయ వ్యవహారాల సెక్రటరీ జనరల్ గా కేకే
తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ వ్యవహారాల సెక్రటరీ జనరల్ గా కె.కేశవరావు నియమితులయ్యారు. కాంగ్రెస్ నుంచి ఇటీవలే బయటకు వచ్చిన కేశవరావు తెరాసలో చేరారు. రేపు తెలంగాణ భవన్లో కేకే బాధ్యతలు స్వీకరించనున్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకులతో కేశవరావుకున్న సంబంధాల నేపథ్యంలో ఆయనను ఈ పదవికి ఎంపిక చేశారు.