: 'సిరీస్' రాజు కన్నుమూత
రాష్ట్ర ఫార్మా రంగంలో పేరెన్నికగన్న పారిశ్రామికవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు 'సిరీస్' రాజు కన్ను మూశారు. ఆయన వయస్సు 97 సంవత్సరాలు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. విజయవాడకు చెందిన ఈయన అసలు పేరు గోకరాజు సుబ్బరాజు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న రాజు.. దేశానికి బ్రిటీష్ పాలన నుంచి స్వేచ్ఛ లభించిన పిమ్మట రాష్ట్రంలో 'సిరీస్' పేరిట ఫార్మాస్యూటికల్ కంపెనీ స్థాపించి ఔత్సాహికులకు మార్గదర్శిగా నిలిచారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేశారు.