: ఉత్తరకాశీ తెలుగు బాధితుల పరిస్థితిపై మంత్రి సమీక్ష
ఉత్తరకాశీలో భారీవర్షాలలో చిక్కుకున్న తెలుగువారి పరిస్థితిపై మంత్రి రఘువీరారెడ్డి సమీక్షించారు. వారికి అందాల్సిన సహాయక చర్యల గురించి అక్కడి అధికారులతో చర్చించారు. భారీ వర్షాలకు ఉత్తరఖండ్ లోని కొండచరియలు విరిగిపడి, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చార్ ధామ్ యాత్రకు వెళ్లిన మనవాళ్లు కొందరు పర్వతాల నడుమ మార్గమధ్యలో చిక్కుకున్నారు.