: చంద్రబాబుపై మంత్రి గీతారెడ్డి ఆగ్రహం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై రాష్ట్ర మంత్రి జె.గీతారెడ్డి ధ్వజమెత్తారు. శాసనసభలో నేడు టీడీపీ సభ్యులు పదేపదే కాంగ్రెస్ మంత్రులను కళంకితులని పేర్కొనడాన్ని ఆమె తప్పుబడుతూ, బాబు వ్యవహారం లేవనెత్తారు. బురదలో పొర్లుతున్న చంద్రబాబు ఇతరులపై బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు. తనపై వచ్చిన కేసుల్లో ఆయన స్టేలు తెచ్చుకున్నారని ఆరోపించారు. బాబు వ్యవహారశైలి నచ్చక నాగం జనార్థనరెడ్డి, దాడి వీరభద్రరావు, కొడాలి నాని వంటి నేతలు పార్టీని వీడారని మంత్రి విమర్శించారు.