: ఇది శిఖండి ప్రభుత్వం:రేవంత్ రెడ్డి
కళంకిత మంత్రులను ఎదురుగా పెట్టి రాష్ట్రప్రభుత్వం శిఖండిలా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ లక్ష కోట్ల సంపాదనకు ఈ మంత్రుల సంతకాలే కారణమని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియంత పరిపాలనకు చరమదశ వచ్చేసిందని రేవంత్ అభిప్రాయపడ్డారు.