: వీసా గడువు ముగిసిన వారు తక్షణం సౌదీ వీడండి: భారతీయులకు ఎంబసీ సూచన


వీసా గడువు ముగిసిన భారతీయులందరూ తక్షణమే సౌదీ అరేబియా విడిచిపెట్టి వెళ్లిపోవాలని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది. ప్రతీ 10 మంది ఉద్యోగుల్లో ఒకటి స్థానికులకే ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్దేశిస్తూ నిటాకత్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో రెండు లక్షల మంది భారతీయులు వెనుదిరగాల్సిన పరిస్థితి ఉంది. లేకుంటే వారిని అరెస్ట్ చేస్తారు. దీంతో భారత రాయబార కార్యాలయం మరోసారి హెచ్చరిక జారీ చేసింది. గడువు ముగిసిన వారందరూ ఎమర్జెన్సీ సర్టిఫికెట్ తీసుకుని తక్షణమే సౌదీని వీడాలని, లేకుంటే జైలు, జరిమానా తదితర చట్టపరమైన చర్యలను ఎదర్కోవాల్సి వస్తుందని పేర్కొంది.

  • Loading...

More Telugu News