: రేపు తెలంగాణ పొలిటికల్ జేఏసీ కీలక భేటీ


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని తెలంగాణ రాజకీయ ఐకాస భావిస్తోంది. ఇందుకోసం ఆదివారం తెలంగాణ రాజకీయ ఐకాస కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ భేటీలో ఉద్యమ కార్యాచరణకు తుదిరూపు ఇవ్వనున్నట్టు తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం తెలిపారు. అలాగే రహదారుల దిగ్బంధం, ఛలో అసెంబ్లీ వంటి పలు ఉద్యమ భవిష్యత్ కార్యక్రమాలపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కోదండరాం చెప్పారు.  

  • Loading...

More Telugu News