: కావూరికి లక్కు... కేబినెట్ మంత్రిగా బెర్త్


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కావూరి సాంబశివరావు జాక్ పాట్ కొట్టారు. ఏకంగా కేబినెట్ మంత్రిగా ఎంపికయ్యారు. గత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి తన నిరసన వెళ్లగక్కిన కావూరి సాంబశివరావును అధిష్ఠానం తాజా మంత్రివర్గ విస్తరణలో సంతుష్టపరిచింది. ఆయనను జౌళిశాఖ మంత్రిగా ఎంపిక చేసినట్లు సమాచారం. మరోవైపు, జేడీ శీలంకు సహాయ మంత్రి పదవి దక్కినట్లు తెలుస్తోంది. వీరు కాకుండా కేబినెట్ మంత్రులుగా శీష్ రాం, ఆస్కార్ ఫెర్నాండెజ్, గిరిజావ్యాస్, సహాయ మంత్రులుగా మాణిక్ రావు గవిట్, సంతోష్ చౌదరి, ఈఎం నాచియప్పన్ ఎంపికయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయి.

  • Loading...

More Telugu News