: ఆ నేతలను బీజేపీ మర్చిపోతోంది: నితీశ్
ఎన్డీయే నుంచి వైదొలగుతూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీలో అటల్, అద్వానీ శకాలను ప్రశంసించారు. బీజేపీ నేతలు వారిని మర్చిపోతున్నారంటూ విమర్శించారు. బీహార్లో భాగస్వామ్యం విషయంలో తమకున్న ఆందోళనలను పట్టించుకోలేదన్నారు. అలాంటప్పుడు తామిక ఏం చేయాలని నితీశ్ ప్రశ్నించారు. బీహార్ బీజేపీ నేతలతో సత్సంబంధాలున్నాయని, బయటి శక్తుల జోక్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.