: శాసనసభ నుంచి టీఆర్ఎస్, బీజేపీ సభ్యులు అవుట్!
సభా కార్యకలాపాలు జరగకుండా అడ్డుపడుతున్న బీజేపీ, టీఆర్ఎస్ శాసనసభ్యులను స్పీకర్ నాదెండ్ల మనోహర్ రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కు గురైన వారిలో 16 మంది టీఆర్ఎస్ సభ్యులు, ముగ్గురు బీజేపీ సభ్యులు, నాగం జనార్దన్ రెడ్డి ఉన్నారు. శాసనసభ మలివిడత సమావేశాల ప్రారంభం నుంచీ తెలంగాణపై తీర్మానం కోసం టీఆర్ఎస్, బీజేపీ సభ్యులు అడ్డుపడుతున్న సంగతి తెలిసిందే. ఇలా పలు డిమాండ్ల కోసం వారు విలువైన సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తుండడంతో స్పీకర్ ఈ చర్య తీసుకున్నారు.