: కాల్ డేటా రికార్డులలో మొబైల్ లోకేషన్ వివరాలు


కాల్ డేటా రికార్డులలో సంబంధిత మొబైల్ నంబర్ తో పాటు అది ఏ టవర్ పరిధిలో ఉందన్న వివరాలను కూడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఇది 2014లో అమల్లోకి రానుంది. కాల్ లిస్టులో మీరు ఏ నంబర్ తో ఎంత సేపు మాట్లాడారు, ఏ రోజున అనే వివరాలు ఉంటాయి. తాజా ఆదేశాల ప్రకారం సంబంధిత నంబర్ కు ఏ టవర్ నుంచి చేశారు? అనే సమాచారాన్ని కూడా పొందుపరచాల్సి ఉంటుంది. దీనివల్ల దర్యాప్తు సంస్థల విచారణకు అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం యోచన.

  • Loading...

More Telugu News