: వడ్డీ రేట్లు తగ్గించని ఆర్బీఐ


సోమవారం ఉదయం ప్రకటించిన మానిటరీ పాలసీలో రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్లను తగ్గించలేదు. వడ్డీరేట్లతో పాటు నగదు నిల్వల నిష్పత్తిని కూడా అలాగే ఉంచింది. దీంతో మార్కెట్లు తీవ్రంగా నిరాశపడ్డాయి. హోల్‌సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌-డబ్ల్యూపీఐ మే నెలలో 4.7 శాతానికి దిగి వచ్చినా ఆర్‌బీఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు మాత్రం కనికరించేదు. రూపాయి బాగా బలహీనపడటంతో పెట్రోల్‌తో పాటు ఇతర దిగుమతి వస్తువుల ధరలు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్ముందు ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందనే ఉద్దేశంతో రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది.

  • Loading...

More Telugu News