: దేశమంతటా రుతుపవనాల విస్తరణ
రుతుపవనాలు నిర్ణీత వ్యవధి కంటే నెల రోజులు ముందుగానే దేశంలోని అన్ని ప్రాంతాలకూ వ్యాపించాయి. ఏటా జూలై రెండో వారానికి రుతుపవనాలు దేశమంతటా విస్తరిస్తాయి. కానీ, ఈసారి నెల రోజుల ముందుగానే ఈ పని పూర్తయినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాలకూ రుతుపవనాలు ఆదివారంనాడు విస్తరించడంతో ఈ పని పూర్తయింది. ఈ నెల ఒకటి నాటికి కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు వాయువేగంతో విస్తరించాయని చెప్పుకోవాలి.