: కొత్తపల్లి కుమారుడి వివాహ రిసెప్షన్ లో నేతల సందడి
ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు కుమారుడి వివాహ రిసెప్షన్ కు ప్రభుత్వ పెద్దలు తరలివచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం దగ్గర్లోని రుస్తుంబాదులోని సుబ్బారాయుడి స్వగృహంలో ఈ వేడుక ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా తదితరులు హజరయ్యారు. వధూవరులు భుజంగరాయలు, శ్రీధర్మ సింధులకు నేతలు ఆశీస్సులు అందించారు.