: ఢిల్లీ విమానాశ్రయంలో మోకాల్లోతు నీరు
భారీ వర్షాల ధాటికి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు నానా కష్టాలు పడుతున్నారు. మోకాల్లోతు చేరిన నీటిలో నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి 2.30 గంటల నుంచి ఉదయం 5.30గంటల వరకూ కురిసిన వర్షం ధాటికి 3వ టెర్మినల్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో సిబ్బంది నీటిని బయటకు పంపే పనిలో తలమునకలై ఉన్నారు.