: చిరంజీవి నిద్రోతున్నారు: దేవినేని ఉమ
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాష్ట్ర వాసులు చిక్కుకుని అవస్థలు పడుతుంటే కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి నిద్రపోతున్నారని తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. తెలుగువారిని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తగిన సహాయక చర్యలు చేపట్టి ఉత్తరకాశీ మార్గంలో చిక్కుకుపోయిన యాత్రీకులను రక్షించాలని కోరారు.
మరోవైపు, ఉత్తరాఖండ్ లో చిక్కుకుపోయిన వారిని రక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా కోరారు. భారీ వర్షాలకు గంగానది పోటెత్తి రహదారులను ముంచెత్తడం, కొండచరియలు విరిగిపడిన కారణంగా చార్ ధామ్ యాత్రలకు వెళ్లిన రాష్ట్ర వాసులు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.