: 300 మంది కోసం లక్షలాది మందిపై నిఘా
దేశ, విదేశీ పౌరుల సమాచారాన్ని అమెరికా ప్రభుత్వం రహస్యంగా సేకరిస్తుందన్న దుమారంపై అక్కడి ప్రభుత్వం అసలు విషయాన్ని బహిరంగపరిచింది. కేవలం 300 మంది వ్యక్తుల సమాచారం కోసం లక్షలాది మంది వ్యక్తుల ఫోన్ కాల్స్ వివరాలు సేకరించామని వెల్లడించింది. అది కూడా వారి కాల్స్ వివరాలు తప్ప సంభాషణ వివరాలు సేకరించలేదని తెలిపింది. ఇలా సేకరించిన వివరాలతో అమెరికాతోపాటు 20 దేశాల్లో ఎన్నో ఉగ్రవాద కుట్రలను భగ్నం చేశామని వెల్లడించింది. ఈ వివరాలను అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అక్కడి కాంగ్రెస్ కు సమర్పించింది.