: చాపలా చుట్టే టీవీలొస్తున్నాయ్!
మనకు అవసరమనుకొంటే చాపలా చుట్టేసే టీవీలు వస్తున్నాయ్... జపాన్‌లోని షినోడా ప్లాస్మా సంస్థకు చెందిన ఇంజనీర్లు వీటిని తయారు చేశారు. సహజంగా టీవీ అంటే మనకు తెలిసి పెద్ద బాక్స్. గాజుతెర ఉండే టీవీలను ఇలా చుట్టేందుకు వీలుపడదు. అయితే ఈ కొత్తరకం టీవీల్లో గాజు తెరకు బదులు చిన్న గాజుగొట్టాలను వాడారు. ఈ గొట్టాలు ఒక మిల్లీమీటరు వ్యాసాన్ని కలిగి, మూడు అడుగుల కంటే ఎక్కువ పొడవును కలిగి ఉంటాయి.
షినోడా ప్లాస్మా సంస్థకు చెందిన ఇంజనీర్లు తయారు చేసిన ఈ కొత్తరకం టీవీలను లూమినస్ అర్రే అని పిలుస్తున్నారు. ఈ టీవీలను గతనెల వాంకోవర్‌లో జరిగిన 'డిస్‌ప్లే వీక్ 2013'లో ఆవిష్కరించారు. ఈ ప్రదర్శనలో లూమినస్ అర్రే ఉత్తమ ప్రోటోటైప్ అవార్డును గెలుచుకుంది. ఈ టీవీలో చిత్రాన్ని ఏర్పరచడానికి అవసరమైన కాంతిని విడుదల చేయడానికి ఇందులో అమర్చిన గాజు గొట్టాల్లో జడవాయువులు, పాస్ఫరస్‌లను నింపారు. నాలుగు అంగుళాల వరకూ నిలువుగా చుట్టేసేలా ఈ టీవీని తయారుచేశారు.