: సల్మాన్ ఎప్పుడొస్తే ఏంటి?: ప్రభుదేవా
కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా ఎదిగిన ప్రభుదేవా ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ సెలబ్రిటీల్లో ఒకడిగా పేరుగాంచాడు. సల్మాన్ కు 'వాంటెడ్'తో బ్లాక్ బస్టర్ అందించిన ఈ ఇండియన్ మైకేల్ జాక్సన్.. తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నాడు. సల్మాన్ ఖాన్ షూటింగ్ లకు చాలా ఆలస్యంగా వస్తాడని అందరికీ తెలిసిన విషయం కాగా.. అలా వస్తే తప్పేమిటంటున్నాడు ప్రభుదేవా. సెట్స్ మీదికి లేటుగా వస్తాడని పేరున్నా.. ఇటీవల ఎన్నో హిట్స్ ఇచ్చాడని ప్రభుదేవా గుర్తు చేశాడు. అయినా, దర్శకనిర్మాతలకు సల్మాన్ వ్యవహారం ఓకే అయినప్పుడు, ఎందుకొచ్చిన చర్చ ఇది? అని తేలిగ్గా నవ్వేశాడు. సల్లూభాయ్ ఆలస్యంగా వచ్చినా.. పని పూర్తయిన తర్వాతే ఇంటికి వెళతాడని వెల్లడించాడు.