: మోడీపై వెనక్కి తగ్గేదిలేదు: బీజేపీ
తాజా పరిణామాలు అసహనం రేకెత్తిస్తున్నా.. బీజేపీ అధినాయకత్వం మాత్రం వెనక్కి తగ్గేదిలేదంటోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రచార సారథిగా మోడీ నియామకాన్ని పునఃసమీక్షించేది లేదని స్పష్టం చేస్తోంది. బీహార్లో బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి అబ్బాస్ ముక్తార్ నక్వీ నేడు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోడీకి ప్రచార పగ్గాలు అప్పగించడం తమ పార్టీ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పారు.