: అద్వానీకి అవకాశం దొరికింది!


గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ పట్ల బీజేపీ అగ్రనేత అద్వానీ తన వ్యతిరేకతను మరోసారి చాటుకున్నారు. ఆయనకు ఈసారి బలమైన అవకాశం దొరికింది. బీహార్లో బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు జేడీయూ ప్రకటించడం పట్ల అద్వానీ స్పందించారు. మోడీని బీజేపీ ప్రచార సారథిగా నియమించడం కారణంగానే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని అద్వానీ నేడు పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో అన్నారు. వచ్చే ఎన్నికలకు గాను బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ గా మోడీ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అద్వానీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించగా, అగ్రనేతలు బుజ్జగించడంతో మెత్తబడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News