: బలం నిరూపించుకుంటాం, చాన్సివ్వండి: గవర్నర్ కు బీహార్ సీఎం వినతి
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం గవర్నర్ ను కలిశారు. బీహార్లో బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని జేడీ-యూ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశమివ్వాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గవర్నర్ ను కోరారు. ఈనెల 19న బలనిరూపణకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన గవర్నర్ కు చెప్పారు. ఉదయం అత్యవసర క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేసిన నితీశ్, ఈ భేటీ అనంతరం జేడీ-యూ ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిశారు. మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని జేడీ-యూ నేత నితీశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, నితీశ్ నిర్ణయంతో బీజేపీ-జేడీయూ పార్టీల 17 ఏళ్ళ స్నేహానికి నేటితో తెరపడినట్టయింది.