: కావూరికి మంత్రి పదవి?
ఎంపీ కావూరి సాంబశివరావుకు కేంద్ర మంత్రి పదవి లభించనున్నట్టు రాష్ట్ర రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. రేపు కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే మాకెన్, జోషి తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. దీంతో, కేంద్ర క్యాబినెట్లో పలు శాఖలకు రేపు సాయంత్రం మంత్రులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరుసార్లు రాష్ట్రం నుంచి ఎంపీగా ఎన్నికైన సాంబశివరావుకు ఈసారి చాన్స్ కచ్చితంగా లభిస్తుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.