: 'ఇదిగో తాయిలం' అంటున్న కేంద్రమంత్రి
స్థానిక సంస్థల ఎన్నికలను కేంద్రం సీరియస్ గానే తీసుకున్నట్టుంది, అందుకేనేమో, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా పలు పథకాలకు కోట్లు కుమ్మరిస్తోంది. తాజాగా, కేంద్ర మంత్రి జైరాం రమేశ్ కూడా తనవంతుగా ఓ తాయిలం ప్రకటించేశారు. అనంతపురం జిల్లాలో గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం రూ.145 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, ఉపాధి హామీ పథకాన్ని సవ్యరీతిలో అమలుచేయడం ద్వారా జిల్లాలో వలసలను విజయవంతంగా నిరోధించగలిగామని చెప్పారు.