: 'యువరాజు' పెదవి విప్పారు!


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ అంతర్గత వ్యవహారాలపై తొలిసారిగా పెదవి విప్పారు. వచ్చే ఎన్నికలకుగాను నరేంద్ర మోడీని బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించడం పట్ల తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మోడీ నియామకం బీజేపీకి సంబంధించిన వ్యవహారమని అన్నారు. మోడీ విషయం తనను అడిగితే ఎలా? అని తిరిగి ప్రశ్నించాడీ కాంగ్రెస్ యువరాజు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పాలన వ్యవహారాలు చూడడమే తన విధి అని రాహుల్ స్పష్టం చేశారు. కాశ్మీర్లో నేడు నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News