: బైక్ ను ఢీకొట్టి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయిన మంత్రిగారు


మంత్రి అహ్మదుల్లా ప్రయాణిస్తున్న వాహనం ఓ బైక్ ను ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయిన ఘటన నేడు కడప జిల్లాలో జరిగింది. జిల్లాలోని పెండ్లిమర్రు వద్ద అహ్మదుల్లా వాహనం బైక్ ను ఢీకొనడంతో ఆ ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. వాహనాన్ని ఆపి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించాల్పిన సదరు మంత్రవర్యుడు నిర్లక్ష్యంగా వాహనం ఆపకుండానే వెళ్ళిపోవడం స్థానికులకు ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో, వారు పెండ్లిమర్రు రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News