: ఇంటిముందు ఆడుకుంటున్న బాలికపై అఘాయిత్యం
కామాంధుల అత్యాచార పర్వానికి మరో బాలిక బలైపోయింది. ఢిల్లీలో ముక్కుపచ్చలారని ఐదేళ్ళ చిన్నారిని మానవమృగాలు కసిదీరా కాటేశాయి. ఆమె బాల్యాన్ని నిర్దాక్షిణ్యంగా చిదిమేశాయి. ఇక్కడి శివారు ప్రాంతమైన గుర్ గావ్ కు చెందిన ఈ అమ్మాయి ఇంటిముందు ఆడుకుంటుండగా కొందరు దుండగులు ఎత్తుకెళ్ళి, దారుణంగా అత్యాచారం చేశారు. అనంతరం సృహ కోల్పోయిన బాలికను సమీపంలోని మెట్రో రైల్వే స్టేషన్ వద్ద విడిచిపెట్టి పరారయ్యారు. ఎవరో పోలీసులకు సమాచారం అందించగా, వారు ఆ పాపను ఆసుపత్రిలో చేర్చించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ చిన్నారి పరిస్థితి విషమంగా మారింది.