: బెంగళూరులో టెర్రర్ అలర్ట్.. భద్రత కట్టుదిట్టం
దేశంలో మళ్ళీ టెర్రర్ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. బెంగళూరు లో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారం ఇప్పుడు అందరిలోనూ భయాందోళనలు రేకెత్తిస్తోంది. కేంద్ర నిఘా సంస్థల నుంచి అధికారులకు ఈ విషయమై తాజా సమాచారం అందడంతో బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ కారులో నలుగురు ఉగ్రవాదులు నగరంలోకి ప్రవేశించారని, వీరు దాడులకు పాల్పడవచ్చన్న కేంద్ర నిఘా సంస్థల సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం ప్రతి వాహనాన్ని నిశితంగా తనిఖీ చేస్తున్నారు