: కేంద్ర మంత్రి అజయ్ మాకెన్ రాజీనామా


ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కేంద్ర గృహ నిర్మాణ, దారిద్ర నిర్మూలన శాఖ మంత్రి అజయ్ మాకెన్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడిన మాకెన్ పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకే రాజీనామా చేసినట్టు స్పష్టం చేశారు. మాకెన్ గతంలో క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు. జాతీయ క్రీడాసంఘాల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం మడమతిప్పని పోరాటం చేశారు. ముఖ్యంగా బీసీసీఐతో ఢీ అంటే ఢీ అన్నారు. బీసీసీఐ సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావాల్సిందే అని ఎలుగెత్తారు.

  • Loading...

More Telugu News