: కొనసాగుతోన్న భేటీల పర్వం


అటు హస్తినలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల భేటీల పర్వం కొనసాగుతోంది. ఢిల్లీలో నేడు మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో సమావేశమై రాష్ట్ర వ్యవహారాలను వివరించారు. ఇక రాష్ట్రంలో మంత్రి జానారెడ్డితో భేటీకి పలువురు నేతలు క్యూ కట్టారు. జానా నివాసంలో ఈ సాయంత్రం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి పొన్నాల సమావేశమయ్యారు. అంతకుముందు జానాను మంత్రులు శ్రీధర్ బాబు, బస్వరాజు సారయ్య, సుదర్శన్ రెడ్డిలతో పాటు ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి తదిరులు కలిశారు. వీరందరూ ప్రధానంగా చలో అసెంబ్లీ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News