: తెలంగాణ తెచ్చేది మా పార్టీయే: నాగం ఉద్ఘాటన


ప్రాంతీయ పార్టీల వల్ల తెలంగాణ సాకారం కాదని, ప్రత్యేక రాష్ట్రం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ నేత నాగం జనార్థనరెడ్డి ఉద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలం కాశవాని సింగారం గ్రామంలో జరిగిన బీజేపీ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో నాగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్డీయే కూటమి మద్దతుతో ప్రత్యేక తెలంగాణను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటులో 273 మంది సభ్యుల మద్దతు ఉంటేనే ప్రత్యేక రాష్ట్రం ప్రకటిస్తారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News