: ఆర్టీసీకి ఆరు కోట్ల నష్టం
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన బంద్ కారణంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)ఆరు కోట్ల రూపాయల రాబడిని కోల్పోయింది. తెలంగాణలోని పలుచోట్ల జరిగిన ఆందోళనల్లో రెండు బస్సులు దహనం కాగా, మూడు బస్సులు ధ్వంసమయ్యాయి. ఇవిగాక ఆర్టీసీకి మరో నలభై లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది.