: నిర్మల్ లో రైతుల ధర్నా
విత్తనాలు తమకు దక్కకుండా నల్లబజారులో అమ్ముతున్నారని ఆరోపిస్తూ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ వద్ద జాతీయరహదారిపై రైతులు ధర్నాకు దిగారు. రైతులు ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైతుకు అందాల్సినవన్నీ నల్లబజారుకు తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపించారు.