: సైనా మళ్ళీ చిత్తయిపోయింది
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మరోసారి ఫైనల్ బెర్తు సాధించడంలో విఫలమైంది. థాయ్ ఓపెన్ క్వార్టర్స లోనే వెనుదిరిగిన సైనా తాజాగా ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పరాజయ పరంపర కొనసాగించింది. నేడు జరిగిన సెమీస్ లో సైనా 21-12, 13-21, 14-21తో జర్మనీ అమ్మాయి జూలియన్ షెంక్ చేతిలో చిత్తయింది. తొలి గేము నెగ్గి మాంచి ఊపుమీదున్నట్టు కనిపించిన ఈ హైదరాబాదీ తార ఆనక వరుసగా రెండు గేములను ప్రత్యర్థికి జారవిడుచుకుని మూల్యం చెల్లించుకుంది.