: కాంగ్రెస్ కోర్ కమిటీ కాదు, అది చోర్ కమిటీ: కేటీఆర్


టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె. తారకరామారావు కాంగ్రెస్ హైకమాండ్ పై మండిపడ్డారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ అంటోన్న కాంగ్రెస్ కోర్ కమిటీ మరో స్కాంకు తెరదీసేందుకు అలా మాట్లాడుతోందని దుయ్యబట్టారు. అది కోర్ కమిటీ కాదని చోర్ కమిటీ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్యాకేజీలతో తెలంగాణ ప్రజలు సంతుష్టులు కాబోరని ఆయన ఉద్ఘాటించారు. తమకు తెలంగాణ రాష్ట్రం కావాల్సిందే అని, సీమాంధ్రులకు మాత్రం ప్యాకేజీ ఇవ్వండని నేడు హైదరాబాద్ లో మీడియాతో మాడ్లాడుతూ అన్నారు.

  • Loading...

More Telugu News