: కేసీఆర్.. నీకు సిగ్గుందా? : మోత్కుపల్లి
తెల్లావారి లేస్తే సీమాంధ్రులంటూ విరుచుకుపడే కేసీఆర్, అసెంబ్లీ టికెట్టు కోసం కృష్ణా జిల్లాకు చెందిన ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నావ్ నీకు సిగ్గుందా? అని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు దుయ్యబట్టారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాలకు విద్యార్థులు బలైపోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ పేరుతో, మృతి చెందిన విద్యార్థుల పేరుతో కోట్లరూపాయలు సంపాదించుకున్నావు. తెలంగాణ కోసం బలైపోయిన విద్యార్థుల ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. ఫాం హౌస్ లో ఉండి పిలుపులిస్తావ్, నీ పిలుపులు నిజమనుకుని విద్యార్థులు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నీవు మాత్రం ఫాం హౌస్ లో దర్జాగా టీవీలు చూస్తూ గడిపేస్తున్నావంటూ విరుచుకుపడ్డారు.