: కోడలికోసం అమెరికా వెళ్ళిన బాబుకు ఘనస్వాగతం
కోడలు బ్రాహ్మణి స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అమెరికా పయనమయ్యారు. ఈ మధ్యాహ్నం అమెరికా చేరుకున్న ఆయనకు శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం తదితరులు విమానాశ్రయంలో బాబు కుటుంబాన్ని కలిశారు. కాగా, లోకేశ్ భార్య బ్రాహ్మణి ఇక్కడి ప్రముఖ స్టాన్ ఫార్డ్ యూనివర్శిటీలో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న స్నాతకోత్సవంలో ఆమె పట్టా అందుకుంటారు.