: ఐటీ కంపెనీ యజమానిని బెదిరించిన వ్యక్తి అరెస్టు
ఎన్ ఫోర్సు మెంట్ డైరెక్టరేట్ అధికారుల పేరుతో విశాఖపట్టణంలో ఓ ఐటీ కంపెనీ యజమానిని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలో ఓ ఐటీ కంపెనీ యజమానిని బెదిరించి ఓ వ్యక్తి 3 లక్షలు డిమాండ్ చేశాడు. అతనిని పోలీసులు వలపన్ని చాకచక్యంగా అరెస్టు చేశారు. అయితే అతనితో పాటు ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు పరారైనట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు అతనిని విచారిస్తున్నారు దీనితో సంబంధం ఉన్న వారిని పట్టుకుంటామని చెబుతున్నారు.