: సచిన్ ను వెనక్కినెట్టిన షారూఖ్


బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ను 'అత్యంత ప్రజాదరణ గల తండ్రి'గా ఓ వెబ్ సైట్ పేర్కొంటోంది. ప్రముఖ ఆన్ లైన్ వివాహ వేదిక 'షాది.కామ్' నిర్వహించిన పోలింగ్ లో షారూఖ్.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తోపాటు అమితాబ్ ను సైతం వెనక్కినెట్టేశాడు. మొత్తం 11 వేలమంది మహిళల మధ్య ఈ పోలింగ్ నిర్వహించగా.. వారిలో అత్యధికులు షారూఖ్ కే ఓటేశారట. రేపు ఆదివారం ఫాదర్స్ డే ను పురస్కరించుకుని ఈ ఆన్ లైన్ ఎన్నిక చేపట్టారు. షారూఖ్ కు 34.83 శాతం ఓట్లు రాగా.. అమితాబ్ కు 31.58 శాతం, సచిన్ కు 18.61 శాతం ఓట్లు దక్కాయి.

  • Loading...

More Telugu News