: మళ్ళీ అరెస్టయిన కోదండరాం
నిన్న చలో అసెంబ్లీ సందర్భంగా అరెస్టయిన తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం నేడు మళ్ళీ అరెస్టయ్యారు. విద్యుత్ సౌధ ఎదుట కోదండరాంతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు, బీజేపీ నేత నాగం జనార్థన రెడ్డి తదితరులు ఆందోళన చేపట్టారు. అయితే, వారందరినీ పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ విచిత్రమైన వాదన వినిపించారు. తాము ట్రాన్స్ కో సీఎండీని కలిసేందుకు వస్తే అరెస్టు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. పోలీసులు తమ పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసుల వైఖరిపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.