: మత్స్య సంపదలో మనదే అగ్రస్థానం: సీఎం
మత్స్యసంపదలో దేశంలోనే మనం అగ్రస్థానంలో నిలిచామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లిలో నూతనంగా నిర్మించిన ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల భవనాలను సీఎం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ దివిసీమలోని తీర ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. మత్స్య సంపదలో ఏడాదికి 11 వేల కోట్ల ఆదాయాన్ని మన రాష్ట్రం సంపాదిస్తోందని సీఎం తెలిపారు.