: ప్రముఖ తమిళ నటుడు మణివణ్ణన్ ఆకస్మిక మృతి


ప్రముఖ దర్శక, నటుడు మణివణ్ణన్ అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూసారు. 59 ఏళ్ల మణివణ్ణన్ ప్రేమలేఖ, భామనే సత్యభామనే, నరసింహ, జంటిల్మన్, శివాజీ వంటి సినిమాల ద్వారా నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. కాగా ఆయన తమిళంతో పాటు తెలుగు, మలయాళంలో 50 సినిమాలకు దర్శకత్వం వహించారు. తాజాగా మోహన్ బాబు నటించిన 'ఎమ్ ధర్మరాజు ఎంఏ' సినిమా ఆధారంగా నిర్మితమవుతున్న 'నాగరాజచోళన్ ఎంఏ' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 400 సినిమాల్లో కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు పోషించిన మణివణ్ణన్ కు తమిళంలో స్టార్ ఇమేజీ ఉంది.

  • Loading...

More Telugu News