: మహాకవి శ్రీశ్రీ 30వ వర్ధంతి
తెలుగు జాతి గర్వించదగ్గ నవయుగ వైతాళికుడు శ్రీశ్రీ 30 వ వర్థంతి ఘనంగా జరిగింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి పలువురు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాహిత్యాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించి మహా మనీషి శ్రీశ్రీ అని అఖిల భారత ప్రజా తంత్ర యువజన సంఘం కొనియాడింది. ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచే శ్రీశ్రీ రచనలు తెలుగు జాతికి గర్వకారణమని యువజన సంఘం నేతలు తెలిపారు. ఎన్నటికీ వన్నె తరగని శ్రీశ్రీ రచనలు యువతరానికి మార్గదర్శకాలుగా నిలిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీరు కోరారు.