: పాక్ జాతిపిత చారిత్రక భవనం ధ్వంసం


పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా చారిత్రక భవనాన్ని ఉగ్రావాదులు ధ్వంసం చేశారు. దీంతో బలూచిస్థాన్ లో ఉద్రిక్తత నెలకొంది. భారత్ నుంచి పాక్ విడివడడానికి, ముస్లిం దేశంగా పాక్ గుర్తింపు పొందడానికి ప్రధాన కారకుడు జిన్నాయే. పాక్ ప్రజలు జిన్నాను జాతిపితగా కీర్తిస్తారు. అలాంటి జిన్నా చారిత్రక భవనాన్ని ధ్వంసం చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. దీని వల్ల పాక్ లో మరిన్ని ప్రాంతాల్లో విధ్యంసం చెలరేగే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News