: లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
వైఎస్ఆర్ కడప జిల్లాలో లక్షల విలువైన ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. అధికారులను చూసిన ఎర్రచందనం స్మగ్లర్లు వాహనాన్ని వదిలి పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా. అధికారులు వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.