: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం


చిత్తూరు, కర్ణాటక సరిహద్దులోని నంగిళికి రెండు కిలోమీటర్ల దూరంలో అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తున్న తిరుపతి డిపోకు చెందిన గరుడ బస్సు, లారీని ఢీకొంది. దాంతో డీజిల్‌ ట్యాంక్‌కు నిప్పంటుకోవడంతో బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ సహా ఐదుగురు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు విడిచారు. బస్సులోనే డ్రైవర్‌, మరో ఇద్దరు ప్రయాణీకులు సజీవ దహనం కాగా తీవ్రగాయాలైన మరో ఇద్దరు ప్రయాణీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో తుదిశ్వాస విడిచారు. మరో 30 మంది ప్రయాణీకులు గాయపడ్డారు.

  • Loading...

More Telugu News