: ఏమండోయ్, ఇది విన్నారా... బ్రిటన్ రాజు మనోడే సుమీ!
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్ మన భారతీయుడే... ఏంటీ నమ్మలేకపోతున్నారా? ఇది చదవండి. ప్రిన్స్ విలియమ్స్ జన్యుపరంగా భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి. విలియం దగ్గరి బంధువుల లాలాజల శాంపిళ్లపై డీఎన్ఏ అనే వంశపారంపర్య పరీక్షల కంపెనీ జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. విలియంకు ఐదోతరం ముత్తాత, స్క్వాటిష్ వ్యాపారస్తుడు అయిన ధియోడర్ ఫోర్బ్స్ తూర్పు ఇండియా కంపెనీ తరుపున గుజరాత్ లోని సూరత్ లో పనిచేశారు. ఆయన ఇంట్లో పనిమనిషిగా ఉన్న ఎలీజా కేవార్క్ అనే మహిళ మైటోకాండ్రియల్ డీఎన్ఏ ఆమె కూతుళ్లు, మనవరాళ్ల ద్వారా డయానాకు చేరింది. డయానా నుంచి విలియం, హ్యారీలకు చేరింది.
ఎలీజా పేరు అమెరికన్ ది అయినప్పటికీ, ఆమె తల్లి కచ్చితంగా భారతీయురాలే అయిఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తల్లినుంచి మాత్రమే సంక్రమించే డీఎన్ఏ అరుదైన మైటో కాండ్రియల్ డీఎన్ఏ ఆమె వారసుల్లో గుర్తించారు నిపుణులు. ఇప్పటివరకూ నమోదైన రికార్డుల ప్రకారం 13 భారతీయులు, ఒక నేపాల్ వ్యక్తిలో మాత్రమే ఇలాంటి డీఎన్ఏ ఉందట.
ఆ రకంగా డయానా పూర్వీకురాలైన ఓ భారతీయ పనిమనిషికి, విలియమ్ కు నేరుగా జన్యుసంబంధాలు ఉన్నట్లు తేలింది. దీంతో ప్రిన్స్ విలియమ్స్ భారతీయమూలాలు కలిగి ఉన్నాడు. ఈ రకంగా చూస్తే భారతీయడు బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించనున్నాడు.