: తెలంగాణ బంద్ పాక్షికం ...ప్రశాంతం
ఛలో అసెంబ్లీ భగ్నం చేసేందుకు చేసిన అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ బంద్ కు పిలుపునిచ్చింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బంద్ పాక్షికంగా అమలవుతోంది. టీఆర్ఎస్ బంద్ కు రాజకీయ జేఏసీ, విద్యార్ధి సంఘాలు, తెలంగాణ న్యూడెమోక్రసీ మద్దతు తెలిపాయి. అయితే తెలంగాణ బంద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. రవాణా వ్యవస్థకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. పలు ఆర్టీసీ కార్యాలయాల వద్ద ఆందోళలన చేసిన వార్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో తెలంగాణ జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది.